Ad Code

టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ


తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈవోకు అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు, భక్తుల సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో భక్తులకు చక్కని సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అటు తరువాత ఆయన తిరుమలలోని అన్నమయ్య భవన్ లో, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

Post a Comment

0 Comments

Close Menu