Ad Code

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : ప్రచారాన్ని పర్యటనను రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్


తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయడం మాత్రమే కాదు, జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం, బిజెపికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు అని రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరిగింది. ఈరోజు ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తారని భావించిన వేళ పవన్ కళ్యాణ్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పరిణామం జనసేన, బీజేపీ అభ్యర్థులలో తీవ్ర నిరాశకు కారణమైంది. వాస్తవానికి శని, ఆదివారాలలో ఆయన ప్రచారం చేయాల్సి ఉండగా దీనికోసం ఆయనతో బీజేపీ ముఖ్య నేతలు కూడా సంప్రదింపులు జరిపారు. తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ కళ్యాణ్ కూడా మిత్రపక్షంగా బిజెపి ఉండడంతో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తారని అంతా భావించారు. ఉమ్మడి ప్రచారం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించారు. కానీ చివరి నిమిషంలో ఆయన తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu