ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తునిలో ఎస్బీఐ ఏటీఎం మిషన్‌ను రాళ్లతో పగలగొట్టి నగదు తీసుకెళ్లేందుకు దుండగుడు యత్నించాడు. అయితే ఎంత ప్రయత్నం చేసినా డబ్బు బయటకు తీయలేకపోయారు. చేసేదమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ తంతగం అంతా సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. విజయవాడ ఎస్బీఐలోని సెంట్రల్ సర్వేలెన్స్ లో దొంగను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తునిలో గాలించి దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఎక్కడైనా ఏటీఎంలో చోరీ చేశాడా ?, మరేమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.
0 Comments