Ad Code

జియోహాట్‌స్టార్‌లో వాయిస్ స్ట్రీమింగ్


దేశంలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ చేతులు కలిపాయి. చాట్‌జీపీటీ వాయిస్ అసిస్టెంట్‌ (మల్టీలింగువల్ కాగ్నిటివ్ సెర్చ్)తో వినోదాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ, సంభాషణల ద్వారా కంటెంట్‌ను వెతికే వినూత్న సదుపాయాన్ని ప్రారంభించాయి. ఇకపై యూజర్లు మెనూల్లో వెతకడం లేదా కీవర్డ్స్‌తో టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చూడాలి? అనే తడబాటు లేకుండా కేవలం సహజమైన భాషలో మాట్లాడితే చాలు. ఓపెన్‌ఏఐ ఏపీఐలను ఉపయోగించి పనిచేసే ఈ వాయిస్ ఇంటర్‌ఫేస్ మీరు చెప్పే మూడ్, సందర్భం, భాషను అర్థం చేసుకుని కచ్చితమైన సలహాలను ఇస్తుంది. కేవలం సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాకుండా లైవ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు కూడా ఈ అసిస్టెంట్ సహాయపడుతుంది. స్కోర్లు, ప్లేయర్ హైలైట్స్, కీలక అంశాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఈ భాగస్వామ్యం కేవలం జియోహాట్‌స్టార్ యాప్‌కే పరిమితం కాకుండా, నేరుగా చాట్‌జీపీటీ యాప్‌లో ఎవరైనా వినోదం గురించి సెర్చ్ చేసినప్పుడు జియోహాట్‌స్టార్‌లోని కంటెంట్‌కు సంబంధించిన లింక్‌లు అక్కడ కూడా కనిపిస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu