హైదరాబాద్ లోని హెచ్‌ఐఐసీలో మంగళవారం బయో ఆసియా-2026 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ 23సంవత్సరాల క్రితం బయోఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేదని, ఈ రోజు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచిందని అన్నారు. గత రెండేళ్లల్లోనే జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొద్ది వారాల క్రితం దావోస్‌లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం, జీనోమ్ వ్యాలీని విస్తరించాం. ప్రపంచస్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు 'వన్-బయో'ను ప్రారంభించాం. గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేశాం. అనేక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆహ్వానించామని వివరించారు. ఇది సాధారణ అభివృద్ధి కాదు, ఇది దృఢమైన దృష్టి ఫలితం అని అన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం బయో ఏషియా 2026. ఈ సదస్సును చూస్తుంటే తాను గర్వంగా చెప్పగలను. బయోఏషియా తన పేరును దాటి బయో-వరల్డ్‌గా మారుతోందని పేర్కొన్నారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికిపైగా ప్రతినిధులు ఇక్కడ హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారు. సైన్స్, ఏఐ, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులను కలిసినప్పుడు అసాధారణమైన ఫలితాలు వస్తాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా సదస్సు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుంది అన్న నమ్మకం ఉందని సీఎం అన్నారు. తెలంగాణతోపాటు ముఖ్యంగా జీవవిజ్ఞాన రంగంపై మా దృష్టిని మీతో పంచుకుంటాను. ఇటీవల మేము తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ప్రకటించాం. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మా లక్ష్యం. ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం అని తెలిపారు. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. తెంగాణ అది అందిస్తుంది అని అన్నారు. బల్క్ డ్రగ్స్ నుండి బయాలజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. తాము కేవలం దేశంలోనే పోటీ పడటం లేదు.. ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నామని చెప్పారు. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. ఇప్పుడు మనం కలిసి దీన్ని సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీ జీసీసీలను స్థాపించండి. ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించండి. మాలిక్యూల్స్, ఔషధాలను డిజైన్ చేయండి. క్లినికల్ అనలిటిక్స్‌ను నడపండి. ఏఐ ప్లాట్‌ఫాంలను అభివృద్ధి చేయండి. డిజిటల్ తయారీని ముందుకు తీసుకెళ్లండి అని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువత మీ విజయానికి భాగస్వాములుగా ఉంటారని హామీ ఇచ్చారు. మనమంతా కలిసి పనిచేస్తే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుం& ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా ఎదుగుతుందన్నారు. తెలంగాణ అంటే వ్యాపారం.. తెలంగాణ ఎదుగుతోంది.. ఈ ఎదుగుదలలో మీరు భాగస్వాములుకండి అని సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ను 'ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర' గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే తెలంగాణ నెక్స్ట్- జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030) రూపొందించామని బయో ఏషియా 2026 సదస్సులో ఆయన వివరించారు. ఇప్పటి వరకు లైఫ్ సైన్సెస్ రంగంలో సప్లై కోసం మాత్రమే మన వైపు చూసిన ప్రపంచం ఇప్పుడు ప్రస్తుతం ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల కోసం చూస్తోందన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా తెలంగాణను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆరఎనఏ, జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో రెడీ టూ వర్క్ ఫోర్స్‌గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామన్నారు. సీబీఆరఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో లాంటి గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని అన్నారు. అందుకే కేవలం ఉత్పత్తి చేయడమే కాÅ£ నేటి అవసరాలÅ£నుగుణంగా కొత్త ఔషధాలను కనుగొనే కేంద్రంగానూ హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. అలాగే గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గానూ మార్చేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, ఆటోమేషన్ ఇన్ బయోలాజిక్స్ మాన్యుఫాక్చరింగ్, డేటా ఆధారిత ప్రెసిషన్ మెడిసిన్, కంప్యూషనల్ బయాలజీ, బయో మాన్యుఫాక్చరింగ్ 4.0 తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.
0 Comments