హైదరాబాద్ లోని పాత బస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమా హాస్పిటల్ వద్ద రౌడీషీటర్ అసద్ తన అనుచరులతో కలిసి ఒక షాపు యజమాని ఖయ్యూంపై కత్తితో దాడికి తెగబడ్డాడు. తన మోటార్ సైకిల్‌పై కూర్చుని ఉండగా అసద్ గ్యాంగ్ ఆకస్మికంగా అతనిపై తల్వార్లతో విరుచుకుపడింది. దాడి అనంతరం వారు షాపులోని ఫ్రిడ్జ్‌ను ధ్వంసం చేసి షాపు అద్దాలను కూడా పగలగొట్టి హంగామా సృష్టించారు. గాయపడిన ఖయ్యూంను హాస్పిటల్‌కు తరలించారు. అసద్ ఆగడాలపై అప్పటి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గతంలోనే పీడీ యాక్ట్ నమోదు చేశారు. అసద్ నేర ప్రవృత్తిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు అతనిపై రాష్ట్ర బహిష్కరణ విధించారు. అయినప్పటికీ అసద్ పాత బస్తీలో ఎలా తిరుగుతున్నాడు. ఈ దాడికి గల కారణాలేమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
0 Comments