Ad Code

26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు


తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి జరగనున్నాయి. బడ్జెట్‌పై చర్చ, ఆమోదం కోసం ఈ దఫా సమావేశాలను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇచ్చేందుకు, అలాగే కీలక బిల్లుల ఆమోదం కోసం సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షలు పూర్తి చేశారు. త్వరలోనే శాఖాధిపతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించి తుది మెరుగులు దిద్దనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ఉన్నందున, అవి ముగిసిన వెంటనే మంత్రులందరితో కలిసి పూర్తిస్థాయి బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.


Post a Comment

0 Comments

Close Menu