Ad Code

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి : 15 మంది మృతి, 80 మందికి పైగా తీవ్ర గాయాలు


పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ షెహజాద్ పట్టణ పరిధిలో వున్న షియా ముస్లింల ప్రార్థనా స్థలం వద్ద జరిగిన ఆత్మాహుతి  దాడిలో దాదాపు 15 మంది మృతి చెందగా దాదాపు 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో నమాజ్ చేసేందుకు జనాభా అధికంగా ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దుండగుడు ఇమామ్‌బారా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. గాయపడిన వారిని వెంటనే పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS), పాలిక్లినిక్ ఆసుపత్రులకు తరలించారు. భారీగా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చనే అనుమానంతో రెస్క్యూ టీమ్‌లు శిథిలాల వద్ద గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ పేలుడు ధాటికి ఇమామ్‌బారా ప్రధాన ద్వారం పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల భవనాల కిటికీలు పగిలిపోయాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఘటనా స్థలం అత్యంత భయానకంగా కనిపిస్తోంది. రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు, రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలు అక్కడి బీభత్సాన్ని కళ్లకు కడుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu