పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై భారత సైన్యానికి చెందిన ఈస్టర్న్ కమాండ్‌ను తీవ్ర అసహనానికి గురిచేశాయి. ఈ క్రమంలో సైన్యానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరారు. కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం (కమాండ్ బేస్) బీజేపీ రాజకీయ అజెండా కోసం ఉపయోగించబడుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. సైన్యానికి చెందిన ఒక సీనియర్ అధికారి బీజేపీ కనుసన్నల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో సహాయం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. "ఒక కమాండెంట్ అక్కడ కూర్చుని బీజేపీ కార్యాలయ పనులు చేస్తున్నారని నా దగ్గర సమాచారం ఉంది" అని ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ఆరోపణలతో ఆర్మీ అధికారులు తీవ్రంగా నొచ్చుకున్నారు. ఫోర్ట్ విలియంకు చెందిన ఇద్దరు జనరల్స్ గవర్నర్‌ను కలిసి అధికారిక లేఖను సమర్పించారు. ముఖ్యమంత్రి వాదనలు నిరాధారమైనవని, అవి సైన్యం ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని వారు స్పష్టం చేశారు. గవర్నర్ ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ సి.వి. ఆనంద బోస్ స్పందిస్తూ రాజ్యాంగ పరిధి దాటి చేసే వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ "మమతా బెనర్జీ తనను తాను బెంగాల్ రాష్ట్రానికి రాష్ట్రపతిగా, రాష్ట్రాన్ని ఒక స్వతంత్ర దేశంగా భావిస్తున్నారు" అని ఎద్దేవా చేశారు.
మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై గవర్నర్ ను కలిసిన ఇద్దరు జనరల్స్ !
Telugu Lo Computer
0
Comments
Post a Comment