తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం వరకు వాటికి సంబంధించిన డబ్బులు చెల్లించాలని టిటిడి సూచించింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారని టీటీడీ పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ ల కోటా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. 24వ తేదీ ఉదయం 10గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగుల కొరకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. 25వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ల కోటా విడుదలవుతుందని పేర్కొంది. మధ్యాహ్నం మూడు గంటలకు అద్దె గదులు బుకింగ్ కోట ఉంటుందని తెలిపింది. తిరుమలకు రావాలనుకుంటున్న భక్తులు ఫిబ్రవరి మాసానికి సంబంధించిన సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని పేర్కొంది. భక్తులు ఆర్జిత సేవలు, సేవా టిక్కెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని వెల్లడించింది. ఇదిలా ఉంటే టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచటానికి కీలక చర్యలు తీసుకుంటుంది.
0 Comments