Ad Code

చర్లపల్లి - తిరువనంతపురం వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్


హైదరాబాద్ కు కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఇది శుక్రవారం పట్టాలెక్కబోతోంది. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్, ఏపీలో హాల్ట్ స్టేషన్ల జాబితా విడుదల అయింది. నాలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేసే ఎక్స్ ప్రెస్ ఇది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. చర్లపల్లి నుంచి తిరువనంతపురం నార్త్ మధ్య ఈ కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. తిరువనంతపురం నార్త్ నుంచి శుక్రవారం (జనవరి 23) ఉదయం 10:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06308 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు సాయంత్రం 4:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇది ఇనాగ్యురల్ సర్వీస్. రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ నంబర్ 17041/17042 టైమ్ టేబుల్ త్వరలో వెల్లడిస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu