Ad Code

ఫాంహౌజ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న సం­తో­ష్‌­రా­వు­ !


మాజీ రా­జ్య­సభ సభ్యు­డు, బీ­ఆ­ర్‌­ఎ­స్‌ సీ­ని­య­ర్ నేత జో­గి­ని­ప­ల్లి సం­తో­ష్‌­రా­వు­పై తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు, మాజీ ఎమ్మె­ల్సీ కల్వ­కుం­ట్ల కవిత సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. గుంపు మేస్త్రీకి ప్రధాన గూడాచారి సంతోష్ రావు అని ఆరోపించారు. సంతోష్ రావు ఓ దుర్మార్గుడు, దెయ్యం కారణంగానే ఎంతో మంది కార్యకర్తలు, నేతలు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారన్నారు. గద్దర్ లాంటి ఉద్యమకారులను సైతం గేటు బయట నిలబెట్టిన ఘనత, ఈటల రాజేందర్ పార్టీ వీడిపోవడానికి సంతోష్ రావే కారణమన్నారు. ఫాంహౌజ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అందించడమే కాకుండా, కేసీఆర్ ఏం తిన్నా., ఏం చేసినా.. సగం ఇడ్లీ తిన్నాడా..మొత్తం ఇడ్లీ తిన్నాడా అన్న విషయాలతో సహా సమాచారం చేరవేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంతోష్ రావును విచారణకు పిలవడం బాగంగానే ఉంది. కానీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది అనుమానంగా ఉందన్నారు. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

Post a Comment

0 Comments

Close Menu