Ad Code

ఏఐ ట్రాఫిక్‌ పరికరంగా హెల్మెట్‌ : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిని సులువుగా గుర్తింపు


బెంగళూరులోని ఐటీ సంస్థలో పంకజ్ తన్వర్ పని చేస్తున్నాడు.  తన నాలెడ్జ్‌తో హెల్మెట్‌ను ఏఐ ట్రాఫిక్ పోలీస్ పరికరంగా తీర్చిదిద్దాడు. ఆ హెల్మెట్‌ ధరించి బైక్‌పై వెళ్తున్నప్పుడు రోడ్డుపై ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిని సులువుగా గుర్తిస్తున్నాడు. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘిస్తున్నారో అన్నది పసిగడుతున్నాడు. ట్రాఫిక్‌ ఉల్లంఘన వివరాలు, ఆ వాహనం నంబర్‌, లొకేషన్‌ సమాచారాన్ని ట్రాఫిక్‌ పోలీసులకు చేరవేస్తున్నాడు. మరోవైపు తన హెల్మెట్‌ను ఏఐ ట్రాఫిక్‌ పోలీస్‌ హ్యాకింగ్‌ పరికరంగా మార్చిన విషయాన్ని పంకజ్ తన్వర్ ఎక్స్‌లో స్వయంగా పేర్కొన్నాడు. అది పనిచేసే విధానాన్ని రియల్‌గా చూపించి వివరించాడు. ఇప్పుడు వాహనదారులు సురక్షితంగా ఉండవచ్చని పేర్కొన్నాడు. పంకజ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇలాంటి హెల్మెట్లను దేశ వ్యాప్తంగా తయారు చేస్తే ట్రాఫిక్‌ ఉల్లంఘనలు తగ్గుతాయని కొందరు అభిప్రాయపడ్డారు. కార్లు, ఇతర వాహనాలపై కూడా వినియోగించే పరికరాన్ని తయారు చేయాలని కొందరు సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu