Ad Code

మెడికల్ సీటు కోసం పాదం నరుక్కున్న విద్యార్థి : విద్యార్థి ఆడిన నాటకాన్ని బట్టబయలు చేసిన పోలీసులు


త్తరప్రదేశ్ లోని జౌన్‍పుర్‍కు చెందిన సూరజ్ భాస్కర్ అనే విద్యార్థి  డాక్టర్ కావాలని కలలు కన్నాడు. మెడికల్ సీటు కోసం రెండు సార్లు ప్రయత్నించినా సాధించలేకపోయాడు. దీంతో ఈ ఏడాది ఎలాగైనా మెడికల్ కాలేజీలో ఎంట్రెన్స్ సాధించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దివ్యాంగుల కోటాలో అయితే తేలికగా ఎంబీబీఎస్‍లో సీటు పొందవచ్చని భావించి ఇందుకోసం తన పాదాన్ని తానే నరుక్కున్నాడు. ఇటీవల పాదం కోల్పోయి అపస్మారక స్థితిలో పడి ఉన్న భాస్కర్ ను ఆసుపత్రిలో చేర్పించామని అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సూరజ్ భాస్కర్ ఒక్కోసారి ఒక్కో రకమైన స్టేట్ మెంట్ ఇవ్వడంపై అనుమానం తలెత్తింది. ఈ క్రమలో అతడి ఫోన్ ను పరిశీలించగా ఓ నంబర్‍కు ఎక్కువ సార్లు ఫోన్ చేయడంతో పాటు ఆ నంబర్ ను డిలీట్ చేయడం పోలీసులకు మరింత అనుమానం కలిగించింది. వెంటనే ఆ నంబర్‍ను గుర్తించి ఫోన్ చేయగా ఆ యువతి సూరజ్ భాస్కర్ ప్రియురాలిగా తేలింది. ఆమెను స్టేషన్ కు పిలిపించి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈసారి ఎలాగైనా ఎంబీబీఎస్ లో చేరాలని సూరజ్ లక్ష్యంగా పెట్టుకున్నాడని ఆమె వివరించింది. అలాగే గత అక్టోబర్ లోనే సూరజ్ వారణాసిలోని బిహెచ్‍యూకు వెళ్లి అక్కడ వైకల్యం సర్టిఫికేట్ కు ప్రయత్నం చేసి విఫలమైననట్లు తెలిపింది. ఎలాంటి వైకల్యం లేకపోవడంతో అక్కడి అధికారులు ఆయనకు సర్టిఫికెట్ జారీ చేయలేదు. దాంతో ఇక సీటు రావాలంటే తాను వికలాంగుడిగా మారాలని నిర్ణయించుకున్న సూరజ్ తనకు తెలిసిన మెడిసిన్ పరిజ్ఞానంతో మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటూ కట్టర్ సాయంతో తన ఎడమ పాదాన్ని కత్తిరించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులకు పోలీసులకు మాత్రం తనపై కొందరు దాడి చేసి తన పాదం నరికేశారని కట్టుకథ చెప్పాడు. ఘటన జరిగిన ప్రదేశంలో సూరజ్ సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులకు ఓ పొలంలో వాడి పారేసిన మత్తు ఇంజెక్షన్లు, కట్టర్ లభించాయి. దీంతో సూరజ్ ఆడిన నాటకం బట్టబయలైంది. మొత్తంగా సూరజ్ ఎంబీబీఎస్ సీటు సంగతి అలా ఉంచితే ఇప్పుడు ఏకంగా తన పాదమే కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదేం పిచ్చిపని అని నెటిజన్లు ఓ రేంజ్‍లో విమర్శలు గుప్పిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu