ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా జుఝేలా గ్రామానికి చెందిన మయాంక్ అనే బాలుడు స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చూస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. మయాంక్ ఇంట్లో మంచం మీద కూర్చుని ఫోన్‌లో రీల్స్ చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు పూర్తి చేయడంతో మరణానికి గల కచ్చితమైన కారణం అధికారికంగా నమోదు కాలేదు. కానీ, వైద్యులు ప్రాథమికంగా గుండెపోటుగానే భావిస్తున్నారు.
0 Comments