పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సంజయ్ దాస్ టీఎంసీ అధినేత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బెంగాల్ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్ హాజరైన ఓ కార్యక్రమంలో సంజయ్ దాస్ మాట్లాడుతూ '' ఈ ముసలి మంత్రగత్తె పశ్చిమ బెంగాల్‌ను పాలిస్తోంది. ఆమె తలను ఖడ్గంతో నరకాలి'' అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సంజయ్ దాస్ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బీజేపీ మథురాపూర్ యూనిట్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ విరుచుకపడింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి హత్యకు బహిరంగ పిలుపుగా టీఎంసీ అభివర్ణించింది. బెంగాల్ కోరుకునే మార్పు ఇదేనా? మహిళలను బెదిరించడం, హింసను కీర్తించడం, మూకదాడి భాషను వేదికపై సాధారణీకరించడం జరుగుతోందా?? అని టీఎంసీ ప్రశ్నించింది.
0 Comments