సిగరెట్‌, పాన్‌ మసాలాపై 40 % జీఎస్టీ విధింపు


పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్ విధించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటువంటి హానికరమైన వస్తువులపై విధిస్తున్న పరిహార సెస్ స్థానంలోకి వస్తాయి. ఫిబ్రవరి 1 నుంచి ఈ నూతన పన్ను రేట్లు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుంది. అయితే బీడీలపై 18 శాతం వస్తు సేవల పన్ను అమలులోకి వస్తుంది. ఇందుకు అదనంగా పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధించబడుతుంది. అలాగే పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించబడుతుంది. నమిలే పొగాకు, జర్దా సువాసనగల పొగాకు, గుట్కా ప్యాకింగ్ యంత్రాల (సామర్థ్య నిర్ధారణ, సుంకం వసూలు) నియమాలు, 2026ను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫై చేసింది. ఇక, పాన్ మసాలా తయారీపై కొత్త ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ పొగాకుపై ఎక్సైజ్ సుంకం విధించడానికి అనుమతించే రెండు బిల్లులను పార్లమెంటు డిసెంబర్‌లో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం