Ad Code

బాబ్రీ మసీదు నిర్మిస్తానన్న టీఎంసీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్


ముర్సీదాబాద్‌లో బాబ్రీ మసీదు లాంటి మసీదును నిర్మిస్తామన్న  టీఎంసీ ఎమ్మెల్యే హుమయున్ కబీర్ ను తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. బెల్దంగా ప్రాంతంలో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే కబీర్ ఉన్నారు. అయితే శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆయన తప్పుకుంటారని తెలిసింది. ఎమ్మెల్యే కబీర్ చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు ఎత్తుగడతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మమత అన్నారు. టీఎంసీ ఎమ్మెల్యే హుమయున్ కబీర్ వ్యాఖ్యలను ఉద్దేశించి  స్వామి అవిముక్తేశ్వరానందసరస్వతీ మహారాజ్ మాట్లాడుతూ  బాబర్ ఓ ఆక్రమణదారుడని, ఆయన అనేక ఘోర నేరాలకు పాల్పడ్డారని, ఒకవేళ ఎవరైనా బాబర్‌తో పోల్చుకుంటే, వాళ్లను తాము ఆక్రమణదారులుగా భావిస్తామని, వారికి తగిన రీతిలోనే ట్రీట్ చేస్తామని  స్వామి అవిముక్తేశ్వరానందసరస్వతీ మహారాజ్ అన్నారు. మసీదు నిర్మాణానికి వ్యతిరేకం కాదు అని, కానీ బాబ్రీ పేరుతో మసీదును నిర్మిస్తే, అప్పుడు దానికి తగినట్లు రియాక్ట్ అవుతామని స్వామీజీ అన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu