Ad Code

ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ లివబుల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దుతాం !


విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 25 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి మూడు దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేసుకోనుంది. అప్పటివరకు తాత్కాలిక కార్యాలయంలో కాగ్నిజెంట్ కార్యకాలపాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. కాగ్నిజెంట్‌ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తోంది. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కలకత్తా, పూణేలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. ఇప్పుడు విశాఖలో కూడా కాగ్నిజెంట్ అడుగుపెట్టింది. హ్యాపెనింగ్ సిటీ విశాఖకు రావాలని కాగ్నిజెంట్ ను ఆహ్వానించాం. త్వరలో 25 వేల మందితో పనిచేసే కేంద్రంగా కాగ్నిజెంట్ తయారు కావాలి. 34 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ కార్యకలాపాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. కాగ్నిజెంట్ లో 85 శాతం మంది భారతీయులే. ఆ సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావటం విశేషం. భవిష్యత్తులో విశాఖ క్యాంపస్ లో లక్ష మంది ఉద్యోగులతో పని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా కాగ్నిజెంట్ ఎదుగుతోంది. గతంలో హైదరాబాద్ లో నాటి టీడీపీ ప్రభుత్వం రూపోందించిన ఎకో సిస్టంతో ఐటీ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. మూడు దశాబ్దాల క్రితం చేసిన విజన్ తోనే దిగ్గజ ఐటీ కంపెనీలకు భారతీయులు నాయకత్వం ఇస్తున్నారు. 1995లో వచ్చిన ఇంటర్నెట్ రివల్యూషన్ తో పాటు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అందుకే ఐటీకి బ్యాక్ బోన్ గా భారతీయులు నిలిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలని భావిస్తున్నాం. ఆ దిశగానే ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్ గా నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా తయారవుతోందని చెప్పారు. విశాఖ నగరానికి బెస్ట్ కనెక్టివిటీ ఉండడంతోపాటు మోస్ట్ లివబుల్ సిటీగా ఉంది. భోగాపురం విమానాశ్రయం, మెట్రో లాంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు వస్తాయి. ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ రూపుదిద్దుకుంటుంది. నౌకాదళ కేంద్రం నుంచి టూరిజం కేంద్రంగా, ఇప్పుడు టెక్ సిటీగా విశాఖ ఎదిగింది. కాగ్నిజెంట్ తోపాటు ఎనిమిది సంస్థలకు ఇవాళ భూమి పూజ చేశాం. గూగుల్ కూడా త్వరలోనే డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే విశాఖలో 150 టెక్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో నైపుణ్యం సాధించిన యువత ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే 20 శాతం జీవన వ్యయం కూడా తక్కువ. ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ లివబుల్ సిటిగా విశాఖను తీర్చిదిద్దుతాం. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరం కూడా విశాఖే. 2032కి 135 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనామిక్ రీజియన్ తయారవుతుంది. ఎకరా భూమి 99 పైసలకే ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఓ గేమ్ ఛేంజర్. గుజరాత్ లో టాటా నానో కారు తయారీ కేంద్రానికి కూడా 99 పైసలకే ఎకరా చొప్పున భూమి ఇచ్చారు. ఇటీవలే భాగస్వామ్య సదస్సులో 613 ఎంఓయూల ద్వారా రూ. 13.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే, ఎస్ఐపీబీల ద్వారా మరో రూ .8.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించాం. నేషనల్ క్యాంటం మిషన్ ను అందిపుచ్చుకుని ఏపీలోని అమరావతిలో క్యాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు కాబోతోందని సీఎం చంద్రబాబు చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu