ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో గంజాయి వ్యాపారం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న అరవ కామాక్షి ఇంటిని స్థానికులు నేలమట్టం చేశారు. గంజాయి వ్యాపారం చేస్తున్న కామాక్షి స్థానిక యువకులను గంజాయికి అలవాటుపడేలా చేయడమే కాకుండా తనకు అడ్డు వచ్చినవారిపై దాడులు చేపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక సీపీఎం నాయకుడు పెంచలయ్యను తన మనుషులతో అతి దారుణంగా నడీరోడ్డుపై హత్య చేయించింది. దీంతో కామాక్షితో పాటు హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా తాజాగా సోమవారం రాత్రి స్థినికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. స్థానికంగా ఉంటూ ఇన్నాళ్లు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కామాక్షి ఇంటిని ప్రజలు కూల్చివేశారు. ఆమె ఇంటితో పాటు ఆమె అనుచరుల ఇళ్లను సైతం కూల్చివేశారు. ఇకపై వారిని తమ ప్రాంతానికి కూడా రానివ్వబోమని స్థానికులు హెచ్చరించారు.
0 Comments