సినీ నటుడు చిరంజీవి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. మూలాలను గుర్తించి, బాధ్యులైన నిందితులను తప్పకుండా అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. "ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేసే కేసులు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే దీనిపై ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఆ టీమ్ ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో విచారణ చేపడుతుంది. ఎవరైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేస్తే తప్పించుకోలేరు" అని హెచ్చరించారు. అదే సమయంలో చాదర్ ఘాట్ కాల్పుల కేసుపై కూడా సీపీ స్పందిస్తూ.. "ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కీలకమైన ఆధారాలు లభించాయి. త్వరలో ఆ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తాం" అని తెలిపారు.
0 Comments