Ad Code

తన చెల్లిని పెళ్లి చేసుకోలేదని మరిది ప్రైవేట్ పార్ట్ కోసేసిన వదిన !

త్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో బర్హన్ ఏరియాకు చెందిన యోగేష్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హల్ద్‌వాణీలో ఉన్న అల్ట్రాటెక్ కంపెనీలో పని చేస్తున్నాడు. యోగేష్ దీపావళి పండుగ నేపథ్యంలో సెలవులు పెట్టి ఇంటికి వచ్చాడు. అతడికి మెయిన్‌పురికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది. నవంబర్ నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ పెళ్లి జరగటం యోగేష్ అన్న రాజ్ బహుదూర్ భార్య అర్చనకు నచ్చలేదు. యోగేష్ తన చెల్లెల్ని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఆమె భరించలేకపోయింది. దీపావళి పూజ అయిపోయిన తర్వాత యోగేష్‌ను అర్చన తన గదిలోకి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత కత్తితో అతడిపై దాడి చేసింది. అతడి ప్రైవేట్ పార్ట్ కోసేసింది. యోగేష్ నొప్పితో విలవిల్లాడుతూ కేకలు పెట్టసాగాడు. అతడి అరుపులు విని కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు. రక్తం ఓడుతున్న యోగేష్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబసభ్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిందితురాలు అర్చనను, ఆమె భర్తను కూడా విచారించారు.

Post a Comment

0 Comments

Close Menu