ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, పాత గాజువాక జంక్షన్ వద్ద నిన్న అర్ధరాత్రి ఓ మోటార్ సైకిల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, మృతులు కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన అజయ్ రాజు, మనోజ్ కుమార్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మోటార్ సైకిల్ అధిక వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి దారి తీసినట్లు గుర్తించారు. అదుపు కోల్పోయిన బైక్ డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో యువకులు తలపై తీవ్ర గాయాలుకు గురై ప్రాణాలు కోల్పోయారు. దీపావళి పండుగ సంబరాల మధ్య ఇలా ఇద్దరు యువకుల అకాల మరణం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదాల నివారణకు యువత వేగం నియంత్రణపై జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.
0 Comments