Ad Code

బీఎస్ఎన్ఎల్ రూ.1499 ప్లాన్‌లో 11 నెలలు ఫ్రీ కాల్స్


బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు రూ.1499 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో దీర్ఘకాలిక వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, డేటాతో సహా ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ లోని అత్యంత ముఖ్యమైనది దాని వ్యాలిడిటీ అనే చెప్పాలి. కంపెనీ తన కొత్త రూ.1499 ప్లాన్‌లో దాదాపు 11 నెలల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్ లో యూజర్లు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా పొందొచ్చు. దీంతో పాటు భారతదేశంలోని ఏ మూలకైనా కావలసినన్ని కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో 24GB డేటా కూడా పొందొచ్చు. రోజుకు 100 SMSలను కూడా పొందవచ్చు. ఎయిర్ టెల్, జియో వంటి కంపెనీలతో పోల్చుకుంటే బీఎస్ఎన్ఎల్ కంపెనీ దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ అనే చెప్పాలి.


Post a Comment

0 Comments

Close Menu