Ad Code

దీపావళి బోనస్ ఇవ్వలేదని నిరసనకు దిగిన టోల్ ప్లాజా ఉద్యోగులు : ఫ్రీగా టోల్‌ గేట్లు ఎత్తివేత


ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఫతేహాబాద్ టోల్ ప్లాజా ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే జాతీయ రాజధాని ఢిల్లీకి కలుపుతుంది. దీపావళికి బోనస్ ఇస్తామని యాజమాన్యం టోల్ ఆపరేటర్లకు హామీ ఇచ్చింది. తీరా చూస్తే పండుగ రానే వచ్చింది కానీ బోనస్ మాత్రం అకౌంట్లలో పడలేదు. దీంతో టోల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. టోల్ గేట్లు ఎత్తేసి ఉచితంగా విడిచిపెట్టేశారు. దీంతో ఒక్కసారిగా యాజమాన్యం దిగొచ్చి కాళ్లబేరానికి వచ్చింది. యాజమాన్యం సంఘటనాస్థలికి చేరుకుని వేరే ఉద్యోగుల్ని రప్పించింది. వారిని పని చేయకుండా టోల్ ఆపరేటర్లు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీలేక బోనస్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించి విధుల్లో పాల్గొన్నారు. ఆదివారం దాదాపు 10 గంటల పాటు టోల్ గేట్లు ఎత్తేయడంతో కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ''నేను గత ఒక సంవత్సరం నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను కానీ వారు మాకు ఎటువంటి బోనస్ ఇవ్వలేదు. మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాము. కానీ వారు మాకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. కంపెనీ ఇప్పుడు సిబ్బందిని భర్తీ చేస్తామని చెబుతోంది కానీ మాకు ఎటువంటి బోనస్ ఇవ్వలేదు.'' అని నిరసన ఉద్యోగి వాపోయాడు.

Post a Comment

0 Comments

Close Menu