Ad Code

వివాహానికి పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన పీవీ సింధు !


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను తన వివాహానికి రావాల్సిందిగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఆహ్వానించింది.ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంను తండ్రి రమణతో కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ నెల 22న వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతున్నారు. మరోవైపు కాబోయే ఈ దంపతులు అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu