Ad Code

దేశీయ మార్కెట్లో టయోటా సెడాన్ క్యామ్రీ విడుదల !


దేశీయ మార్కెట్లో టయోటా కొత్త సెడాన్ క్యామ్రీని విడుదల చేసింది. ఈ కారును సిమెంట్ గ్రే, యాటిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ, ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, ప్రెషియస్ మెటల్ అనే 6 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ సెడాన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలై అమ్మకాలలో దూసుకవెళ్తోంది.  కంపెనీ దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.48 లక్షలుగా నిర్ణయించింది. కంపెనీ ఈ ప్రీమియం సెడాన్‌ను ఫుల్లీ లోడ్ చేసిన సింగిల్ వేరియంట్‌లో మాత్రమే పరిచయం చేసింది. టయోటా క్యామ్రీ 2.5-లీటర్ పెట్రోల్ డైనమిక్ ఫోర్స్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది e-CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ ఇంజన్ 230bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇది ఎకో, స్పోర్ట్, నార్మల్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. క్యామ్రీ డిజైన్ గురించి చూస్తే.. ఇందులో ఆకర్షణీయమైన గ్రిల్, C – ఆకారపు LED DRLలు, మల్టీ – స్పోక్ అల్లాయ్ వీల్స్, షార్ప్-క్రీజ్ డోర్ ప్యానెల్‌లు, కొత్త డిజైన్ LED టెయిల్‌ల్యాంప్‌లు ఇంకా హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. కారు లోపలి భాగం గురించి చెప్పాలంటే.. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. కొత్త గ్రాఫిక్స్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, కొత్త స్టీరింగ్ వీల్, అప్డేట్ చేయబడిన సెంటర్ కన్సోల్ ఇంకా సీట్ అప్హోల్స్టరీ, మల్టీ – జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS అలాగే 360-డిగ్రీ సరౌండ్ కెమెరాతో సహా అనేక అధునాతన ఫీచర్‌లతో కారు విడుదలైంది. ఇది HUD, EPB, వైర్‌లెస్ మొబైల్ ప్రొజెక్షన్, వైర్‌లెస్ ఛార్జర్, 10-వే అడ్జస్టబుల్ పవర్డ్ ఫ్రంట్ సీట్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు ఇంకా రిక్లైన్ ఫంక్షన్‌ సీటు ఇలా అనేక రకాల ఆకర్షణీయమైన సదుపాయాలను అందించారు.

Post a Comment

0 Comments

Close Menu