Ad Code

గూగుల్ క్యాలెండర్ కొత్త అప్‌డేట్ !

గూగుల్ క్యాలెండర్ టూల్‌ను ఉపయోగించి వ్యక్తులు, టీమ్‌లు మరియు సంస్థలు వారి రోజువారీ కార్యక్రమాలను, సమావేశాలను, తదితర కార్యాచరణలను సులభంగా నిర్వహించుకోవచ్చు. ఇది క్లౌడ్ ఆధారిత సిస్టమ్ గా ఉండడంతో, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఆన్‌లైన్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. గూగుల్ క్యాలెండర్‌ను వినియోగించడం చాలా సులభం. గూగుల్ క్యాలెండర్ వెబ్‌సైట్ లేదా గూగుల్ మెయిల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. మీరు మీ కార్యక్రమాలు, సమావేశాలు, మరియు మరిన్ని సులభంగా సెట్ చేసుకోవచ్చు. మీ రోజువారీ, వారపు, నెలవారీ కార్యక్రమాలను సెట్ చేయడానికి గూగుల్ క్యాలెండర్ చాలా ఉపయోగకరమైనది. మీరు ట్యాప్ చేసిన ప్రతి రోజులో "ఇవెంట్ క్రియేట్" అనే ఆప్షన్‌ను ఉపయోగించి అనుకున్న కార్యాచరణలను జోడించవచ్చు. ఈ టూల్ మీకు మీరు చేయబోయే కార్యక్రమాల కోసం ముందుగా నోటిఫికేషన్లు పంపిస్తుంది. కాబట్టి మీరు మరచిపోతే, క్షణాల్లో గుర్తు పడుతుంది. మీకు ఒక సమావేశం లేదా ఈవెంట్ ఏర్పాటు చేయాలని ఉన్నా, మీరు ఈ గూగుల్ క్యాలెండర్‌లో ఆ కార్యక్రమాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మీ పనిలో అవసరమైన వ్యక్తులందరికీ ఈవెంట్‌ను షేర్ చేయడం సులభం. మీరు మీ ఈవెంట్ లేదా మీటింగ్‌కు కావలసిన సమయాన్ని మరియు స్థలాన్ని ఎంచుకోవచ్చు. మీరు ఫిజికల్‌గా సమావేశం చేసుకోవచ్చు లేదా వీడియో కాల్ కోసం లింక్ పంపవచ్చు. మీరు గూగుల్ క్యాలెండర్‌ను ఇతర అప్లికేషన్లతో సమకూర్చి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ ఫోన్‌లో ఉన్న క్యాలెండర్‌ను మీ గూగుల్ క్యాలెండర్‌తో సమకూర్చవచ్చు. గూగుల్ క్యాలెండర్‌తో మీ కార్యకలాపాలు, సమావేశాలు, ప్రొజెక్ట్ మేనేజ్ మెంట్ టాస్క్స్‌ను సులభంగా సమయ బద్ధంగా షెడ్యూల్ చేసుకోవచ్చు. కరోనా తరువాత వర్చువల్ మీటింగ్స్ పెరిగాయి. గూగుల్ క్యాలెండర్ ద్వారా జూమ్, గూగుల్ మీట్ వంటి ఆన్‌లైన్ వేదికల లింకులను సులభంగా జోడించవచ్చు. గూగుల్ క్యాలెండర్ క్లౌడ్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి, మీ డేటా ఏ డివైస్‌లోనైనా ఒకేసారి అందుబాటులో ఉంటుంది. మీరు మీ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, అన్ని పరికరాల్లో ఒకే సమాచారాన్ని చూడవచ్చు. అంతేకాకుండా ఇటీవల ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే గూగుల్ క్యాలెండర్ యాప్‌లో కొత్త ఫీచర్లను వచ్చాయి. టాస్కులు క్రియేట్ చేయడం, వాటిని ఎడిట్ చేయడం, సబ్ టాస్క్ లను సులువుగా క్రియేట్ చేయడం వంటివి ఈజీగా చేసుకోవచ్చు. గతేడాది వెబ్ యూజర్లకు మాత్రమే ఉన్న ఫుల్ స్క్రీన్ ఆప్షన్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లూ వాడుకోవచ్చు. అందుకోసం గూగుల్ క్యాలెండర్ హోంస్క్రీన్ లో యూజర్ ప్రొఫైల్ పక్కనే చెక్ మార్క్ ఆప్షన్ కనిపిస్తుంది. చెక్ మార్క్ ఆప్షన్‌ను లో మై టాస్క్, ట్రావెల్, న్యూ లిస్ట్ అనే ఆప్షన్లు ఉంటాయి. అందులో చేయాల్సిన టాస్క్‌లు, పూర్తయిన టాస్క్‌లు, కొత్త టాస్క్‌ వివరాలన్నీ ఒకేచోట కనిపిస్తాయి. గూగుల్ వర్క్ స్పేస్ యూజర్లకు, గూగుల్ వర్క్ స్పేస్ ఇండివిడ్యువల్ కస్టమర్లు, వ్యక్తిగత గూగుల్ అకౌంట్లు కలిగిన వారికి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆ ఆప్షన్ రోల్‌ అవుట్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu