విశాల్ మెగామార్ట్ ఐపీఓ మదుపర్ల నుంచి భారీ సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. చివరి రోజైన శుక్రవారం నాటికి 28 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. అత్యధికంగా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 85.11 రెట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కోటా 15 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 2.43 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ రూ.2400 కోట్లు సమీకరించింది. మొబిక్విక్ ఐపీఓ ఏకంగా 125.82 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. క్యూఐబీ కోటా అత్యధికంగా 125.82 రెట్లు ఓవర్ స్క్రైబ్ అయ్యింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 114 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 141 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. మొత్తంగా 46 లక్షలకు పైబడి దరఖాస్తులు వచ్చాయి. సాయి లైఫ్ సైన్సెస్ ఐపీఓ మొత్తం 10.27 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. క్యూఐబీ కోటా 29.78 రెట్లు, ఎన్‌ఐఐ కోటా 4.99 రెట్లు సబ్‌స్క్రైబ్ అవ్వగా.. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.39 రెట్లు మాత్రమే సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఈ మూడు కంపెనీలు డిసెంబర్ 18న లిస్ట్ కానున్నాయి. ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఐపీఓ రెండో రోజు పూర్తయ్యేసరికి 2.66 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుది. అత్యధికంగా రిటైల్ కోటా 4.26 రెట్లు సబ్‌స్క్రైబ్ అవ్వగా.. ఎన్‌ఐఐ కోటా 3.13 రెట్లు, క్యూఐబీ కోటా 1.89 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యిది. 16వ తేదీ వరకు బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
0 Comments