అల్లు అర్జున్‌ హంగామా చేయకపోతే, ఈ గొడవ అయ్యేదే కాదు !


అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చి ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 'ఇండియా టుడే' నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న ఆయన, అల్లు అర్జున్‌ అరెస్టు ఘటనపై మాట్లాడారు. ''ఈ దేశంలో సల్మాన్‌ఖాన్‌, సంజయ్‌దత్‌లు ఎందుకు అరెస్టు అయ్యారు. ఒక సాధారణ పౌరుడి దగ్గరి నుంచి ప్రధాని వరకూ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుంది. 'పుష్ప2' విడుదల సందర్భంగా బెనిఫిట్‌ షోకే కాకుండా టికెట్‌ ధరలు పెంచుకోవడానికీ మేమే అనుమతి ఇచ్చాం. అయితే, ఆ షోకు ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్‌ అక్కడకు వచ్చారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి, థియేటర్‌, మేనేజ్‌మెంట్‌ వాళ్లను అరెస్ట్‌ చేశారు. పది రోజుల తర్వాత అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది. కావాలని సినిమా నటుడిని అరెస్టు చేశారని చర్చ మొదలు పెట్టారు. అతడు సినిమా స్టారా? పొలిటికల్‌ స్టారా? అన్న విషయాన్ని మా ప్రభుత్వం చూడదు. నేరం ఎవరు చేశారన్న దాన్నే చూస్తాం. అక్కడ అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చి సినిమా మాత్రమే చూడలేదు. కారులో నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ ర్యాలీలా అభివాదం చేస్తూ వెళ్లారు. ఆయన ఎలాంటి హంగామా లేకుండా వచ్చి సినిమా చూసి ఉంటే ఈ గొడవ అయ్యేదే కాదు. అయినా కూడా జరిగిన ఘటనకు సంబంధించి ఏ11 కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన కారణంగా ఒక మహిళ చనిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? 9 ఏళ్ల పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన సినిమా చూడాలనుకుంటే స్టూడియోలో స్పెషల్‌ షో వేసుకుని చూడొచ్చు. ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు. మీరు ప్రేక్షకులు, అభిమానులతో కలిసి చూడాలనుకుంటే, ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేదంటే, మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇస్తే, వాళ్లు ఏర్పాట్లు చూసుకుంటారు. అలా కాకుండా సడెన్‌గా వచ్చేస్తే, ఉన్న కొద్దిమంది సిబ్బందితో వాళ్లు ఎలా సిద్ధం కాగలరు. అల్లు అర్జున్‌ను కావాలని ఎందుకు అరెస్ట్‌ చేస్తాం. ఆయన మేనమామ చిరంజీవి కాంగ్రెస్‌ నేత. ఆయన సొంత మామ చంద్రశేఖర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అల్లు అర్జున్‌ సతీమణితో మా కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. పోలీసులు చేయాల్సిన పని వాళ్లు చేస్తారు. లా అండ్‌ ఆర్డర్‌ ప్రకారం నడుచుకుంటారు. అల్లు అర్జున్‌ అరెస్టయితే, ఇంత చర్చిస్తున్నారు కదా! ఆ ఘటనలో చనిపోయిన మహిళ కుటుంబం ఎలా ఉంది? వాళ్ల పరిస్థితి ఏంటి? తీవ్రంగా గాయపడిన ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు? అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఆ తర్వాత ఎలా బతుకుతాడు? అన్న విషయాలను ఒక్కరు కూడా అడగలేదు. అల్లు అర్జున్‌ ఫిల్మ్‌ స్టార్‌. సినిమాలు చేయడం ఆయన వ్యాపారం. డబ్బులు పెడతారు. సంపాదిస్తారు. మీకు ఏమొస్తుంది? నాకేమొస్తుంది? రియల్‌ ఎస్టేట్‌ చేసే వ్యక్తులు ఉన్నారు. ప్లాట్‌లు అమ్ముతారు. డబ్బులు సంపాదిస్తారు. ఈ దేశం కోసం భారత్‌-పాకిస్థాన్‌ బోర్డర్‌కు వెళ్లి ఏమైనా యుద్ధం చేశారా? మూవీ తీస్తున్నారు. డబ్బులు వస్తున్నాయి. నా ఫేవరెట్‌ నటుడు కృష్ణ. ఆయన ఇప్పుడు లేరు. నాకు నేనే పెద్ద స్టార్‌ని. నాకంటూ అభిమానులు ఉండాలి కానీ, నేనెవరికీ అభిమానిని కాదు.'' అని రేవంత్‌రెడ్డి చెప్పారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains