బెంగళూరులోని ఆవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.దొమ్మసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. అరుణ (31) స్నానం చేయడానికి హీటర్ ద్వారా నీటిని వేడి చేయడానికి ఉంచింది. ఆడుకుంటుండగా ఏడాదిన్నర చిన్నారి లిత్విక్ దానిని పట్టుకుని కేకలు వేయడంతో తల్లి కాపాడే క్రమంలో తీవ్రగాయాలయ్యాయి. ఇరుగుపొరుగురు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స సమయంలో ఆమె ఆస్పత్రిలో మృతి చెందింది. చిన్నారి కూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
0 Comments