ఉల్లిపాయపై నల్ల మచ్చలు కనిపిస్తాయి. ఈ డార్క్ స్పాట్స్ ఆస్పెర్‌గిల్లస్ నైగర్ అనే నిర్దిష్ట రకం ఫంగస్ వల్ల ఏర్పడతాయి. ఈ ఫంగస్ మట్టిలో కనిపిస్తుంది. సాధారణంగా ఉల్లిపాయలలో కనిపిస్తుంది. ఇది బ్లాక్ ఫంగస్ వంటి తీవ్రమైన వ్యాధిని కలిగించనప్పటికీ ఈ ఫంగస్ మన శరీరంలో అలర్జీని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అలర్జీతో బాధపడే వారు ఈ రకం ఉల్లిపాయలను తినకూడదు. ఈ ఉల్లిపాయ ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి హానికరం. కాబట్టి ఉల్లిపాయలో నల్లమచ్చలు ఉంటే ఒకటి లేదా రెండు పొరలు తీసి తర్వాత తింటే మంచిది. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది ఫంగస్‌ను అధికం చేస్తుంది. ఈ రకమైన ఫంగస్ తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి.
0 Comments