ఏఆర్ రెహమాన్, సైరా భాను విడిపోయినట్లు వారి లాయర్ వందనా షా అధికారికంగా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ 'X' ద్వారా విడాకులపై స్పందిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. ''మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. పగిలిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయి. కానీ పలిగిన ముక్కలు మళ్లీ యథావిధిగా అతుక్కోలేవు. అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం'' అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కాగా, రెహమాన్, సైరా భాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమ్, అమీన్ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
0 Comments