Ad Code

చేతగానోనికి మాటలెక్కువ - చేవలేనోనికి బూతులెక్కువ !


నుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ చేతగానోనికి మాటలెక్కువ.. చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందని హరీశ్‌రావు విమర్శించారు. పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ గారి నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ గారి వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు. తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ కట్‌లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు. నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం అని హరీశ్‌రావు అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu