Ad Code

మళ్లీ భారత్, చైనా డైరెక్ట్ విమానాలు ?


బ్రెజిల్ లోని రియోడిజనీరోలో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగమంత్రి జై శంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీ20 సదస్సు కోసం హాజరైన వీరిద్దరూ విరామంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసుల పునరుద్ధరణపై చర్చించారు. అలాగే కైలాష్ మానస సరోవర్ యాత్రను పునరుద్ధరించే అంశంపైనా చర్చించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గతంలో భారత్, చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నిలివేశారు. అంతలోనే సరిహద్దు వివాదం కూడా తెరపైకి రావడంతో వాటిని తిరిగి పునరుద్ధరించలేదు. అప్పట్లో లడఖ్‌లో మొదలైన ప్రతిష్టంభన గాల్వాన్‌లో ఘర్షణలకు దారి తీసింది. ఇందులో 20 మంది భారతీయ సైనికులు చనిపోవడం, చైనా కూడా భారీగా బలగాలు నష్టపోవడంతో చర్చలు ప్రారంభమయ్యాయి. వివిధ దశల్లో జరిగిన చర్చలు ఫలించి తాజాగా ఇరు దేశాలూ సైనికుల్ని వెనక్కి రప్పించాయి. ఇప్పుడు ఇరుదేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసుల పునరుద్ధరణ, మానస్ సరోవర్ యాత్ర కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu