Ad Code

రేణు దేశాయ్ తల్లి కన్నుమూత !


సినీ నటి రేణు దేశాయ్ తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తల్లి ఫోటో షేర్ చేసిన ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు.అలాగే తన పోస్ట్‌లో పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జాతరే శయనం, ఇహ సంసారే బహు దుస్తారే, కృపయా పరే పాహి మురారే." మళ్లీ మళ్లీ ఒకటి పుడుతుంది, మరల మరల ఒకరు మరణిస్తారు, మరల మరల ఒకరు తల్లి కడుపులో నిద్రపోతారు, ఈ అపరిమితమైన జీవన సముద్రం దాటడానికి నాకు సహాయం చేయండి, ఇది దాటలేనిది, నా ప్రభూ అంటూ ఆదిశంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు. అయితే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు ఆమె మరణానికి కారణం ఏమిటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

Post a Comment

0 Comments

Close Menu