జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా ఆంధ్రప్రదేశ్ లో రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.99 మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, ఇప్పటి వరకు 5 లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయి అన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నట్లు తెలిపారు. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం షాపుల్ని కేటాయించామని.. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వంలో రూ.1,800 కోట్ల అవినీతి జరిగిందని.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. రూ.99కే నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చామన్నారు.
0 Comments