Ad Code

దేశీయ మార్కెట్‌లో హెచ్‌ఎండీ ఫ్యూజన్ విడుదల ?


దేశీయ మార్కెట్‌లో హెచ్‌ఎండీ ఫ్యూజన్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను తాజాగా హెచ్‌ఎండీ సంస్థ విడుదల చేసింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ అధునాతన డిజైన్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ సెల్ఫ్‌ రిపేర్‌ ఫీచర్‌తో లాంచ్‌ కానుంది. భారత్‌లో అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. హెచ్‌ఎండీ ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం అమెజాన్‌ ప్రత్యేక లైవ్‌ పేజీని క్రియేట్‌ చేసింది. అయితే ఎటువంటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను అమెజాన్‌ వెల్లడించలేదు. అయితే హెచ్‌ఎండీ హ్యాండ్‌సెట్‌ సెల్ఫ్‌ రిపేర్‌ కిట్‌తో లాంచ్‌ కానుందని తెలిపింది. దీని ద్వారా బ్యాక్‌ కవర్‌, డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్‌ పోర్ట్‌ను రిపేర్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6 పిన్‌ కనెక్టర్‌తో కూడిన మాడ్యూలర్‌ డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. అవుట్‌ఫిట్‌ను అటాచ్‌ చేసేందుకు ఫలితంగా ఫోన్‌ ఫంక్షనాలిటిని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ప్రతి స్మార్ట్‌ అవుట్‌ఫిట్‌తో ఫోన్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ లో మార్పులు చేయవచ్చు. హెచ్‌ఎండీ ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం Rugged, సాధారణ కేస్‌లను ఆవిష్కరించింది. అవుట్‌డోర్‌ షూట్‌ కోసం ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. గ్లోబల్‌ మార్కెట్‌లో సెప్టెంబర్‌లోనే విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ గ్లోబల్‌ వేరియంట్‌ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్ వేరియంట్ 108MP ప్రైమరీ కెమెరా సహా 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. అదే 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల అయింది. భారత్‌ మార్కెట్‌లోనూ ఇదే తరహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. గ్లోబల్‌ మార్కె్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో విడుదల అయింది. మరియు Adreno 613 GPU తో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. హెచ్‌ఎండీ ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ భారత్‌ విడుదల ఖరారు అయినా.. ఎప్పుడు లాంచ్‌ కానుందనే సమాచారాన్ని సంస్థ వెల్లడించలేదు. హెచ్‌ఎండీ నుంచి సెప్టెంబర్‌ నెలలో స్కైలైన్ పేరుతో స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. 108MP ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. 6.55 అంగుళాల FHD+ pOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. 33W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 108MP కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరాలను అమర్చి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కస్టమ్ బటన్‌, సెల్ఫ్ రిపేర్‌ కిట్‌ను కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu