తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే పైలెట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. విమానం సేఫ్ ల్యాండింగ్ కోసం అధికారుల ప్రయత్నించారు. విమానంలోని ఇంధనాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం రెండు గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. విమానంలోని హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో 20 అంబులెన్స్‌లు, 20 ఫైర్ ఇంజిన్లు, పారా మెడికల్ సిబ్బందిని రెడీ చేశారు. ఏమవుతుందో అనే టెన్షన్ అందరిలోనూ కలిగింది. మిగతా విమానాలను ఎయిర్‌పోర్ట్ నుంచి తరలించారు. విమానాన్ని బెల్లీ లాండింగ్ చేద్దామనుకున్నారు. అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు చక్రాలు బయటకు రావు. అయితే అలా కాకుండా మామూలుగానే ల్యాండ్ చేశారు. అంతా సురక్షితంగా జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
0 Comments