కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సమంత మరోసారి స్పందించారు. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఇండస్ట్రీ, ప్రజలు చూపించిన ప్రేమే ఈ వివాదం నుంచి బయటకు వచ్చేలా చేసిందని వెల్లడించారు. లేకుంటే మరింతగా కుంగిపోయేదానిని, అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో కొండా సురేఖపై టాలీవుడ్ హీరోయిన్ సమంత సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.
0 Comments