దేశీయ మార్కెట్లో అక్టోబర్ 8న టెక్నో స్పార్క్ 30సీ 5జీ పేరుతో టెక్నోస్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన టీజర్ విడుదల అయింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 48MP సోనీ కెమెరా, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ అనేక దేశాల్లో అందుబాటులో ఉంది. ఆ దేశాల్లో ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటాయి. మరియు 48MP సోనీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ముందువైపు పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేతో విడుదల కానుంది. టెక్నో గత వారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ టెక్నో స్పార్క్ 30C స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా టెక్నో స్పార్క్ 30, టెక్నో స్పార్క్ 30 ప్రో హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మీడియాటెక్ హీలియో G81 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు 4GB ర్యామ్ +128GB స్టోరేజీ, 6GB ర్యామ్ +128GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. అదే ముందువైపు డ్యూయల్ ఫ్లాష్‌తో కూడిన 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ సిరీస్ గ్లోబల్ మార్కెట్‌లో ఆర్బిట్ బ్లాక్, ఆర్బిట్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
0 Comments