సెక్యులరిజం అనేది యూరోపియన్ కాన్సెప్ట్ అని, భారత్ లో దాని అవసరం అసలే లేదని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి పేర్కొన్నారు. తాజాగా కన్యాకుమారి లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సెక్యులరిజం పై సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. భారతదేశ ప్రజలకు వ్యతిరేకంగా అనేక మోసాలు జరిగాయని, వాటిలో సెక్యులరిజానికి తప్పుడు వివరణ ఒకటి అని వివరించారు. వాస్తవానికి సెక్యులరిజం అనేది యూరోపియన్ వారి భావన అని తెలిపారు. చర్చి, రాజుకు మధ్య జరిగిన పోరాటం వల్ల సెక్యులరిజం ఉద్భవించిందని వెల్లడించారు. కానీ భారత్ ఈ ధర్మానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. ఇక్కడ వైరుధ్యాలుండవు కాబట్టి.. సెక్యులరిజం అవసరం లేదు. సెక్యులరిజాన్ని ఐరోపాలోనే ఉండనివ్వండి. భారతదేశంలో దాని అవసరమే లేదన్నారు. 1976లో రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అనే పదాన్ని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రవేశపెట్టారని విమర్శించారు. ఎమర్జెన్సీ కాలంలో అభద్రత భావంతో ఉన్న ప్రధాని కొన్ని వర్గాల ప్రజలను మభ్య పెట్టేందుకే రాజ్యాంగంలో లౌకిక వాదాన్ని తీసుకొచ్చారని గవర్నర్ ఆర్.ఎన్.రవి పేర్కొన్నారు.
0 Comments