Ad Code

గేబియాన్‌ బుట్టల ద్వారా బుడమేరు గండ్లు పూడ్చుతాం !


బుడమేరుకు భారీగా గండ్లు పడటంతో విజయవాడలోని పలు కాలనీలకు వరద పోటెత్తింది. యుద్ధప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. సైన్యం కూడా రంగంలోకి దిగింది. గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండ్లను గేబియాన్‌ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు) ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది. ''బుడమేరుకు గండ్లు పడిన చోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు గుర్తించాం. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉంది. వీటిని గేబియాన్‌ బుట్టలతో పూడ్చుతాం. మొదట గేబియాన్‌ బుట్టలు పేర్చి.. తర్వాత రాళ్లు వేస్తాం. బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షితకట్ట నిర్మిస్తాం. గేబియాన్‌ బుట్టల తయారీ స్థానికంగా జరుగుతోంది. ఇసుక సంచులతో నింపి హెస్కో బుట్టలు కూడా వాడతాం. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్‌ఏడీఆర్‌ బృందం పనిచేస్తోంది''అని ఆర్మీ అధికారులు తెలిపారు. మరోవైపు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే గండి ద్వారా 30 నుంచి 40వేల క్యూసెక్కుల వరదనీరు విజయవాడలోని రాయనపాడు, అజిత్‌సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాలను ముంచెత్తింది. 

Post a Comment

0 Comments

Close Menu