Ad Code

వచ్చే విద్యాసంవత్సరం నుంచే పరీక్షా విధానంలో మార్పులు !


ఏం చదివాడో, ఎక్కడ చదివాడో అసలు తెలియని వైకాపా అధినేత జగన్ విద్యాశాఖ గురించి చెప్పడం వింతగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా గత సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలు వెయ్యి  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం కారణంగా పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆక్షేపించారు. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తామని లోకేశ్ తెలిపారు. గుడ్లు, బర్ఫీలు, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంసమామ.. పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. జగన్ అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu