సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు !


ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని సరియా జలపాతం పర్యాటకుల పాలిట మృత్యుకుహరంగా మారింది. మండలంలోని శివారు ప్రాంతంలో ఉన్న జీనబాడు పంచాయతీలో ఉన్న ఈ జలపాతానికి విశాఖపట్నం, అనకాపల్లితోపాటు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సందర్శకులు తరలివస్తుంటారు. బయటకు సాధారణంగా కనిపించే జలపాతం సమీపంలోని మూడు ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. విజయనగరంకు జిల్లాకు చెందిన 8 మంది శనివారం సరియా జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చారు. ఒకరు జలపాతంలో గల్లంతవ్వడంతో అతడిని రక్షించేందుకు ఇద్దరు నేవీ ఉద్యోగులు ప్రయత్నించారు. ఆ నేవీ అధికారుల్లో ఒకరు గల్లంతయ్యారు. సరియ జలపాతంలో వెంకటసాయి (28), నేవీ ఉద్యోగి దిలీప్‌కుమార్ (30)లు గల్లంతైనట్లు గుర్తించారు. ఈరోజు మధ్యాహ్నం సరియా జలపాతం సందర్శనకు వచ్చిన వెంకట సాయి కాలుజారి జలపాతంలో పడిపోగా అతని రక్షించేందుకు దిగిన దిలీప్‌కుమార్‌ కూడా గల్లంతయ్యారు. వెంకటసాయి విజయనగరం జిల్లాలోని ఫార్మా కంపెనీలో పని చేస్తున్నారు. వారిద్దరి ఆచూకీ కోసం అనంతగిరి పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించినప్పటికీ గల్లంతయిన వారి ఆచూకీ దొరకలేదు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains