వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గుడ్ బై !


ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను వైసీపీకి రాజీనామా చేసి కూటమిలోకి వెళుతున్నట్లు ఆయన వెల్లడించారు. కూటమిలో ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. పిఠాపురం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని పేర్కొన్నారు. తనకు వెన్నుపోటు రాజకీయం తెలియదన్నారు. పిఠాపురం నుంచి 2004లో బీజేపీ నుంచి పోటీ చేసి పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌కు దగ్గరి వ్యక్తిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ ఏర్పాటు తరువాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మరోసారి పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆయనకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో పెండెం దొరబాబును కాదని వంగా గీతకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వకపోకవడంతో అసంతృప్తిగా గురైన ఆయన, అయినా వైసీపీలోనే కొనసాగారు. అయిష్టంగానే వంగా గెలుపు కోసం పని చేశారు. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమి తరువాత ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains