Ad Code

గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల ముందస్తు బుకింగ్‌ ప్రారంభం !


గూగుల్‌ సంస్థ మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌ ను ఆగస్టు 13 న నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌ లో గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. భారత్‌లో ఆగస్టు 14 న విడుదల కానున్నాయి. ఈ పిక్సల్‌ 9 సిరీస్‌ ఆన్‌లైన్‌ సహా ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది. భారత్‌లో వివిధ ప్లాట్‌ఫాంల ద్వారా సేల్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. క్రోమ్‌ ద్వారా ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. క్రోమా బ్యానర్‌ ఇమేజ్‌ ఆధారంగా పిక్సల్‌ 9 మరియు పిక్సల్ 9 ప్రో భారత్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా రిలయన్స్‌ డిజిటల్‌ టీజర్‌ ఆధారంగా ఫిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో అందుబాటులో ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫాంలో పిక్సల్‌ 9 ప్రో మరియు పిక్సల్‌ 9 ప్రో XL కూడా అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఈ గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు జెమిని AI ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS సహా టెన్సార్‌ G4 చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు 7 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చని తెలుస్తోంది. పిక్సల్ డ్రాప్స్‌ ద్వారా ఎక్లూజివ్‌ ఫీచర్‌లను వినియోగించుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ రీకాల్‌ ఫీచర్‌ తరహాలో పిక్సల్‌ స్క్రీన్‌షాట్‌ పేరుతో ఫీచర్‌ అందుబాటులో ఉండనుందని సమాచారం. దీంతోపాటు ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా ఈ సిరీస్‌ 9 సిరీస్‌ SOS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మరియు మాల్‌వేర్‌ సహా ఇతర స్కామ్‌లపై యూజర్లను అలెర్ట్‌ చేస్తుంది. ఎమర్జెన్సీ సమయాల్లో వినియోగదారులకు సాయం చేసేలా ఈ పిక్సల్‌ 9 సిరీస్‌ SOS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అగ్నిప్రమాదాలు, వరదలు సహా ఇతర విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తత సందేశాలను పంపుతుందని తెలుస్తోంది. దీంతోపాటు మాల్‌వేర్‌ సహా ఇతర స్కామ్‌లపై అప్రమత్తం చేస్తుందని సమాచారం. భారత్‌ మార్కెట్‌లో తొలిసారిగా విడుదల చేస్తున్న ఫోల్డ్‌ ఫోన్‌ 6.3 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 8 అంగుళాల ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 48MP ప్రధాన కెమెరా సహా 10.5MP + 10.5MP మరో రెండు కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu