Ad Code

టాటా నెక్సాన్, పంచ్ ఈవీలపై ప్రత్యేక తగ్గింపు !


టాటా కార్ల అమ్మకాల్లో టాటా పంచ్‌ కారు అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్ ఇప్పటి వరకు దాదాపుగా 20 లక్షల ఎస్‌యూవీ కార్ లను అమ్మింది. ఇలా విక్రయించిన కార్లల్లో సియెర్రా, సఫారి లాంటి పాత మోడల్‌ లు, కొత్త మోడళ్లైన పంచ్, నెక్సాన్, హారియర్, న్యూ సఫారి వంటి కార్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే టాటా కంపెనీ టాటా హాయర్, సఫారిపై నెలాఖరు వరకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. అలాగే ప్రముఖ మోడల్స్ అయిన నెక్సాన్, పంచ్ ఈవీలపై కూడా ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. టాటా నెక్సాన్ టాటా కంపెనీకు సంబంధించిన ఒక ప్రసిద్ధ మోడల్. ఈ మోడల్ నెలవారీగా అమ్ముడవుతున్న టాప్ 10 వాహనాల్లో స్థిరంగా ఉంది. అయితే గత కొన్ని నెలలుగా నెక్సాన్ అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా మే 2024లో నెక్సాన్ టాప్ 10 జాబితాలో కూడా చేరలేకపోయింది. జూన్‌లో నెక్సాన్ జాబితాలో చేరలేదు. దీంతో ఈ మోడల్‌పై కంపెనీ ప్రత్యేక తగ్గింపు ధరను అందిస్తోంది. నెక్సాన్ ఎంపవర్డ్+ ఎల్ఆర్, ఎంపవర్డ్ ప్లస్ ఎల్ఆర్ డార్క్ వేరియంట్‌లపై రూ. 1.3 లక్షల విలువైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే ఈ మోడల్‌ లోని ఇతర వేరియంట్‌లపై రూ. 50,000 నుంచి రూ. 70,000 మధ్య తగ్గింపును అందిస్తోంది. కాగా టాటా పంచ్ ఈవీ పరిమాణం, ఫీచర్లు, ధర, ముఖ్యంగా దాని పవర్‌ ట్రైన్ ఎంపికల కారణంగా యూజర్లను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే టాటా పంచ్ సాధారణ, ఈవీ వేరియంట్‌ లను టాటా మోటార్స్ జూన్ 2024లో 18,238 యూనిట్లను విక్రయించింది. అంటే దాదాపు ఈ మోడల్ 66 శాతం వైవైవై వృద్ధిని సాధించింది. దీంతో అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ టాటా పంచ్ ఈవీపై రూ. 10,000 నుంచి రూ. 30,000 మధ్య తగ్గింపులను అందిస్తోంది. టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 10.98 లక్షల నుంచి మొదలవుతాయి. అదేవిధంగా ఈ కారు మొత్తం 20 వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu