Ad Code

వచ్చే ఐదేళ్లలో 44000 కిమీ కవచ్ సిస్టం !


టెక్నాలజీ ఎంత పెరిగిన రైలు ప్రమాదాలను పూర్తిగా నిలువరించలేక పోతున్నారు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత అధికారులతో కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని అన్నారు. వచ్చే ఐదేళ్లలో నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ 44,000 కి.మీలను కవచ్ కిందకు తీసుకువస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కవచ్ అనేది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ సిస్టం. ఒక ట్రైన్ పట్టాల మీద వెళ్తున్న సమయంలో.. అదే ట్రాక్‌ మీద ఒకవేలా ట్రైన్ వస్తే అలాంటి సమయంలో రెండూ ఢీ కొట్టుకోకుండా నిరోధిస్తుంది. ఇది రైలు వేగాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రమాద సంకేతాలకు గుర్తిస్తే వెంటనే ట్రైన్ ఆపరేటర్లను హెచ్చరిస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాద సంకేతాలు గురించినప్పటికీ ట్రైన్ ఆపరేటర్ చర్యలు తీసుకొని సమయంలో ఇదే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేస్తుంది. ప్రస్తుతం కవచ్ సిస్టమ్‌కు ముగ్గురు మాత్రమే తయారీదారులు ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ తయారీదారులు కూడా పెంచాలని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ ఢిల్లీ - ముంబై & ఢిల్లీ - హౌరా మార్గాల్లో కవచ్ ఇన్‌స్టాలేషన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి మరో 6000 కిమీ కవచ్ ఇన్‌స్టాలేషన్‌ కోసం టెండర్లను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.


Post a Comment

0 Comments

Close Menu