Ad Code

ఆగస్టు 13న మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌ 2024 !


గూగుల్‌ మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌ తేదీని వెల్లడించింది. అయితే ప్రతి సంవత్సరం నిర్వహించే తేదీ కంటే సుమారుగా రెండు నెలల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో సాధారణంగా గూగుల్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 13వ తేదీన నిర్వహించనుంది. ఈ గూగుల్‌ ఈవెంట్‌లో కొత్త పిక్సల్‌ సిరీస్‌ సహా ఇతర ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌ల గురించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ గూగుల్‌ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియా మౌంటెన్‌వ్యూలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 13వ తేదీ 10:30 PM కు ప్రారంభం కానుంది. గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ సహా పిక్సల్‌ వాచ్‌ 3 ను ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో ఏయే గ్యాడ్జెట్‌లను లాంచ్‌ చేయనున్నారో గూగుల్‌ వెల్లడించకపోయనా.. గూగుల్‌ AI తో కూడిన గూగుల్ పిక్సల్‌ 9 సిరీస్‌ను లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో గూగుల్‌ పిక్సల్‌ 9, పిక్సల్‌ 9 ప్రో మరియు పిక్సల్‌ 9 ప్రో XL ఉన్నాయి. దీంతోపాటు పిక్సల్‌ బడ్స్‌ ప్రో 2, పిక్సల్‌ వాచ్‌ 3 ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ పైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక సంస్థలు AI పై ప్రయోగాలు చేస్తుండగా గూగుల్ మాత్రం AI రంగంలో ముందు వరసలో ఉంది. జెమిని పేరుతో సొంత AI చాట్‌బాట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ను అనుభవాన్ని మెరుగుపరిచే ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. సెక్యూరిటీ ఫీచర్‌లు, పనితీరు మెరుగుపరిచేందుకు కావాల్సిన అప్‌గ్రేడ్‌లు, మరియు AI ఆధారిత ఫీచర్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu